3 March, 2026 | 2:42 PM

కంట్రీ క్లబ్‌లో షికారు

03-03-2026 12:00 AM
  1. రంగుల పండుగ హుషారు
  2. హోలీ పిచ్‌కారీ కారు ఆవిష్కరణ 
  3. హాజరైన సినీ నటి పూనమ్‌కౌర్

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): పండుగ ఆనందాల్ని అనుబంధాల మేళవింపునకు గుర్తుగా కంట్రీ క్లబ్ హైదరాబాద్ వినూత్నంగా హోలీ పిచ్‌కారీ కారును ఆవిష్కరించింది. బుధవారం బేగంపేటలోని పోలిస్ హాకీ స్టేడియంలో  కంట్రీ క్లబ్ రంగ్ బసంత్ 2026తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నగరా ల్లో హోలీ వేడక జరుపుకుంటున్న సందర్భం గా సోమవారం కంట్రీ క్లబ్ చైర్మన్ వై రాజీవ్‌రెడ్డి, నటి పూనమ్‌కౌర్, మినీ కార్ డిజైనర్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కన్యాబోయిన సుధాకర్‌లతో ఈ హోలీ పిచ్‌కారి కారును ఆవిష్కరించారు.

వీరు చలో పట్టాయా విఐపీ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కార్డును కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ చైర్మన్ వై రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అని పేర్కొన్నారు. ఈసారి హోలి నిర్వహణ సృజనాత్మకత, గుర్తింపు అంతర్జాతీయ దృక్పధాన్ని మిళితం చేసే వేడుకలకు నాంది పలుకుతుంది‘ అని అభిప్రాయపడ్డారు.

నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. పిచ్‌కారీ కారు వైవిధ్యభరితంగా ఉందని కొనియాడారు. సృజనాత్మకత ఉన్న కళాకారులకు ప్రోత్సాహం అత్యవసరమని అన్నారు. సుధాకర్ మాట్లాడుతూ.. కళాత్మక సాంస్కృతిక నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో క్లబ్ తన నిబద్ధతను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ వస్తోందన్నరు.