3 March, 2026 | 6:18 PM

జేఈఈ మెయిన్స్‌లో ఆకాష్ ప్రభంజనం

03-03-2026 12:00 AM

ఫలితాల్లో సత్తాచాటిన ఇనిస్టిట్యూట్ షేక్‌పేట్ బ్రాంచి విద్యార్థులు

హైదరాబాద్, మార్చి 2(విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్(ఫేజ్1) ఫలితాల్లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ షేక్‌పేట్ బ్రాంచి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇనిస్టిట్యూట్‌కు చెందిన హంజాలా అబేదీన్ 99.9921864, దేవేష్ శ్రీగోపాల్ అగర్వాల్ 99.5999512, శుభాగ్య సత్వత్ 99.0560808 పర్సంటైల్ సాధించిన వారిలో ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారని అసిస్టెంట్ డైరెక్టర్ త్రిప్తి సింగ్, అకడమిక్ హెడ్ వంశీ, సెంటర్ హెడ్ శ్రీధర్ పేర్కొన్నారు.

అలాగే మా ఇనిస్టిట్యూట్ లో 99 పర్సంటైల్ (ముగ్గురు విద్యార్థులు), 95 పర్సంటైల్ (10 మంది విద్యార్థులు),90 పర్సంటైల్ (22 మంది విద్యార్థులు) ఈ ఘన త సాధించారన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ త్రిప్తి సింగ్, అకడమిక్ హెడ్ వంశీ, సెంటర్ హెడ్ శ్రీధర్ టాపర్లను అభినందించారు. ఏప్రిల్‌లో జరగనున్న ఫేజ్-2 ఫలితా ల్లో మేము మరిన్ని ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివరాలకు శ్రీధర్ 9985454636 మీకు అందుబాటులో ఉంటారని ఒక ప్రకటనలో తెలిపారు.