సాకర్ కిక్కు షురూ
12-06-2026 01:12 AM
- మొదలైన ఫుట్‌బాల్ ప్రపంచకప్
- దిరిపోయిన ఆరంభ వేడుకలు
మెక్సికో, జూన్ 11 : సాకర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ మొదలైంది. మెక్సికో సిటీ వేదికగా మొదటి ఆరంభ వేడుకలు అట్టహాసం గా జరిగాయి. ఈ సారి మూడు దేశాలు అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
మెక్సికో సిటీలో ఓపెనింగ్ సెర్మనీ అభిమానులను ఉర్రూతలూ గించింది. ప్రముఖ గ్లోబల్ పాప్ సింగర్ షకీరా ఆరంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో తన ఆటపాటలతో అందరినీ హుషారెత్తించింది. ఆమెతో పాటు గ్రామీ అవార్డు విన్నర్ బర్నా బాయ్ టోర్నీ అధికారిక గీతానికి ప్రదర్శన ఇచ్చారు. 90 నిమిషాల పాటు జరిగిన ఆరంభ వేడుకల్లో జే బాల్విన్, బెలిం డా, డానీ ఓషన్, లీలా డౌన్స్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ అలరించారు.






