అమ్మాయిల ధనాధన్
నేటి నుంచే టీ20 ప్రపంచకప్
మొన్నటి వరకూ ఐపీఎల్ హంగామాను ఆస్వాదించిన క్రికెట్ ఫ్యాన్స్‌ను అల రించడానికి మరో మెగాటోర్నీ వచ్చేసింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ షురూ కాబోతోంది. మరి ధనాధన్ క్రికెట్‌లో తమకు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచకప్‌ను భారత్ అందుకుంటుందా... లేక టైటిల్ ఫేవరెట్స్ ఆతిథ్య ఇంగ్లాండ్, ఆసీస్, కివీస్, సఫారీలలో ఒక జట్టు ట్రోఫీ ఎగరేసుకుపో తుందా ?
బర్మింగ్‌హామ్, జూన్ 11 : గత కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌కు ఆదరణ బాగా పెరిగింది. పురుషుల క్రికెట్ స్థాయిలో మహిళల క్రికెట్ మ్యాచ్‌లను అభిమానులు వీక్షిస్తున్నారు. అందుకే వన్డే ప్రపంచకప్‌కు సైతం మంచి ఫాలోయింగ్ వచ్చింది. డబ్ల్యూపీఎల్‌కు సైతం వ్యూయర్ షిప్ పెరిగింది. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐసీసీ ప్రతి రెండేళ్లకో సారి నిర్వహించే మెగా టోర్నమెంట్లో ఈసా రి రికార్డు స్థాయిలో 12 జట్లు తలపడుతున్నాయి.
శుక్రవారం బర్మింగ్‌హామ్‌లోని ఎ డ్జ్బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ క్రికెట్ పండుగ మొదలవుతుంది. గత ఎడిషన్ వరకూ 10 జట్లే ఉండగా 12కు పెంచి రెండు గ్రూపులుగా విభజించారు. ల్రీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెం డు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తా యి. జూలై 5న లండన్‌లోని చారిత్రాత్మక లారడ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇటీవలే వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్ మీద ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు పొట్టి ఫార్మాట్ లోనూ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోం ది. అదే జరిగితే ఏకకాలంలో వన్డే, టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఘనత సాధిస్తుంది. గతంలో ఆసీస్ మాత్రమే ఈ ఘన తా సాధించింది. కాగా మహిళల క్రికెట్‌కు క్రేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో అటు ఐసీసీ కూడా ఈ మెగాటోర్నీ కోసం భారీ ప్రైజ్ మ నీని కేటాయించింది. మొత్తం టోర్నీ కోసం రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కేటాయించారు. గత ఎడిషన్ కంటే ఇది 10 శాతం ఎక్కువ. ట్రోఫీ గెలిచిన జట్టుకు రూ.21.8 కోట్లు, రన్నరప్ కు 10 కోట్లు అందజేయనున్నారు.
గ్రూప్1
భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ , నెదర్లాండ్స్
గ్రూప్2
ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్,
నేటి మ్యాచ్
ఇంగ్లాండ్ X శ్రీలంక
వేదిక : బర్మింగ్‌హామ్
సమయం : రాత్రి 11 గంటలకు






