1 June, 2026 | 2:04 AM

త్రిబుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థుల ఎంపిక

01-06-2026 01:13 AM

ఉట్నూర్, మే 31( విజయ క్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బాసర త్రిబుల్ ఐటీ కి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యా రు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈసారి పదవ తరగతిలో 10 గ్రేడ్ సాధించిన  విద్యార్థులలో బాసర త్రిబుల్ ఐటీ కి ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకున్న వారి లో ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ ఎం తెలిపారు. త్రిబుల్ ఐటీ కి ఎంపికైన నాగ చైతన్య, సుజన్, వంశీకృష్ణ, రామగిరి అనుష్క, సూర్యవంశి కళ్యాణి, సూర్యవంశి శివప్రసాద్ లు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంద్రవెల్లి పాఠశాల నుండి  అ త్యధికంగా బాసర త్రిబుల్ ఐటీ లో విద్యను అభ్యసించుటకు ఎంపికైన విద్యార్థులలో ఇంద్రవెల్లి ప్రథమ స్థానంలో నిలిచి ఉందని హెచ్‌ఎం తెలిపారు.