జన్నారంలో ఆరుగురు పంచాయతీ కార్యదర్శుల బదిలీ
బాధ్యతలు స్వీకరించిన ముగ్గురు నూతన కార్యదర్శులు
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. మండల పరిధిలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు పంచాయతీ కార్యదర్శులు వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ముగ్గురు నూతన కార్యదర్శులు వచ్చి బాధ్యతలు స్వీకరించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఉమర్ షరీఫ్ తెలిపారు.
రానున్న వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన, అలాగే విధుల్లో ఉన్న కార్యదర్శులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.






