ఇసుక ట్రాక్టర్ కు జరిమానా
సుల్తానాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ బి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టార్పిలిన్ లేకుండా రాజీవ్ రహదారిపై వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ కు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సిరికొండ అనిల్ జరిమానా విధించారు, సోమవారం సుల్తానాబాద్ ట్రాఫిక్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిరికొండ అనిల్ ఇసుక లోడ్ ట్రాక్టర్ల డ్రైవర్లు, ఓనర్లు ఇసుక లోడ్ తీసుకువెళ్లే సమయంలో టార్పాలిన్ కవర్లతో కప్పి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం తో వెళ్ళడం వల్ల వాటి వెనుక వెళ్లే వాహన చోదకులు కళ్ళలో ఇసుక రేణువులు పడి ప్రమాదానికి గురవుతున్నారు అన్నారు, ఇకముందు జాగ్రత్తగా టార్పాలిన్ కవర్లు కప్పుకొని రావాలి అని వారికి అవగాహనా కల్పించారు, మరియు జరిమాన గురించి నాన్-కాంటాక్ట్ ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు పంపి జరిమాన వేయడం జరిగిందని పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్ తెలిపారు.






