మాజీ ఎంపీ నామకు రాఖీ కట్టిన సోదరి ధనమ్మ
29-08-2026 12:00 AM
ఖమ్మం, ఆగస్టు 28, (విజయక్రాంతి): ఖమ్మం నెహ్రూనగర్లోని వరలక్ష్మి నిలయం నందు శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు ఆయన సోదరి ధనమ్మ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సోదరి ధనమ్మ నామ నాగేశ్వరరావును ఆశీర్వదించి, మిఠాయి తినిపించారు.
అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.






