1 June, 2026 | 10:00 PM

నేత్రదానంతో ఇతరులకు చూపు

01-06-2026 08:59 PM

* చెడే ధనలక్ష్మి మహిళ నేత్రాలతో ఇరువురికి కంటి చూపు

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ ఆ వ్యక్తి నేత్రాలు దానం చేస్తే ఇద్దరు వ్యక్తులకు కంటిచూపు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని కొందరు వ్యక్తులే మానవత్వాన్ని ప్రదర్శించి దాని తను చాలించిన అనంతరం నా నేత్రాలను ఇతరులకు ఇవ్వండి అని ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం. ఎంతోమంది వ్యక్తులు చనిపోయిన అనంతరం వారి నేత్రాలను దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ఒకరిగా గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన చెడే ధనలక్ష్మి (65) అనే మహిళ సోమవారం చనిపోయింది.

చనిపోయిన ఆ మహిళ నేత్రాలను దానం చేసి ఇద్దరు వ్యక్తులకు చూపు వచ్చే అవకాశం కలిగించేందుకు ఆ మహిళ ముగ్గురు కూతుర్లు ముందుకు వచ్చారు. స్థానిక వాసవి, వనిత క్లబ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడకు చెందిన లైన్స్ క్లబ్ బృందం వచ్చి చనిపోయిన ధనలక్ష్మి నేత్రాలను సేకరించారు. చనిపోయిన ధనలక్ష్మి నేత్రాలను దానం చేసేందుకు ఆమె ముగ్గురు కూతుర్లు జ్యోతి, సునీత, హరిత ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో ముఖ్య గణేష్ రావు, కర్నాటి నాగేశ్వరరావు, పేరూరి నాగేశ్వరరావు, కర్నాటి కృష్ణమూర్తి, కర్నాటి శ్రీనివాస్ రావు, వెచ్చ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.