రంగపేట పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
మానకొండూరు, జూలై 30 (విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామ సర్పంచ్ కొత్త రాంరెడ్డి - రజిత దంపతుల కుమారుడు కొత్త అజిత్ రెడ్డి 28 వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రంగపేట ప్రభుత్వ పాఠశాలలో 37గురు విద్యార్థులకు గురువారం సుమారు 18 వేల రూపాయల వ్యయంతో స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.అజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు, అట్టహాసాలకు వ్యయం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా పాఠశాల పిల్లలందరికీ ఉపయోగపడేలా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. బ్యాగులు అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో పండుగ, సంతోషకరమైన వాతావరణం నెలకొన్నది. గ్రామ సర్పంచ్ కుమారుడు విదేశాలలో ఉన్నప్పటికిని సొంత గ్రామంలో చేసిన ఈ వితరణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, గ్రామ ప్రెసిడెంట్ దావ్య శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి,కొత్త,సత్యనారాయణరెడ్డి,రెవెల్లి రాజలింగం,మురళి,ఉప సర్పంచ్ వేల్పుల కొమురయ్య యాదవ్, వార్డు సభ్యులు కొత్త శ్రీకాంత్ రెడ్డి,మర్రి సంపత్ రెడ్డి,మర్రి రమ్య,గుడాల మహేందర్ గౌడ్,రుద్రారం అశోక్, రుద్రారం లచ్చయ్య, షేక్ కరీంభీ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్ కొత్త మంజుల,గ్రామ ప్రముఖులు,యువకులు తదితరులు హాజరయ్యారు.






