అభివృద్ధి పనులపై అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గల్లి గల్లి తిరిగి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
బెజ్జూర్ జులై 14 (విజయ క్రాంతి ) బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో చేసినటువంటి అభివృద్ధి పనులను, పలు రికార్డులను జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ ఆకస్మిక తనిఖీ చేశారు. బెజ్జూరు, ఎలుకపల్లి గ్రామాలలో గల్లి గల్లి తిరిగి గ్రామపంచాయతీలో చేసినటువంటి అభివృద్ధి పనుల తీరును పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు, మురికి కాలువలు, గ్రామపంచాయతీ భవన రంగులు, పలు చేసినటువంటి పనుల వివరాల జాబితాను పరిశీలించారు. గ్రామపంచాయతీ భవనం స్లాబ్ పై ఉన్న కోటింగ్ చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎలకపల్లి గ్రామంలో నాలి తవ్వకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
రహదారిపై మట్టి పోయడంతో బురదగా మారి ప్రజలు ఇబ్బందులు పడతామని తెలిపారు. గ్రామంలోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ సరోజ, కార్యదర్శి వైకుంఠం కు ఆదేశించారు. అనంతరం జిల్లా సెకండరీ పాఠశాలలో వెళ్లి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మండల విద్యాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ విద్యాలయం కి వెళ్లి వసతి గృహంలో బిల్డింగ్ యొక్క పగుళ్లను చూసి అదనపు కలెక్టర్ తన సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నారు.
బిల్డింగ్ యొక్క మరమ్మత్తుల కోసం నివేదికను పంపిస్తామని ప్రిన్సిపల్ అరుణ కు తెలిపారు.గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ శ్రీనివాస్ కు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మందుల నిల్వలను, వసతులను, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి అందించాలని డాక్టర్ శ్రావణ్ కుమార్ కు ఆదేశించారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయురాలు మారుతాయి, కారోపర్ వసంత్, నాయకులు దుర్గం తిరుపతి తదితరులు ఉన్నారు.






