calender_icon.png 14 February, 2026 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్య భవనాలకు భూమి పూజ

14-02-2026 05:20:17 PM

పెంచికల్‌పేట్,(విజయక్రాంతి): పెంచికల్‌పేట్ మండలంలోని చేడ్వాయి గ్రామ పంచాయతీ, దరోగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతన గ్రామ సమైక్య (వీవో) భవనాల నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చేడ్వాయి గ్రామ పంచాయతీలో వీవో భవనం, కొత్తగూడెంలో వీవో భవనాలు అలాగే వంట షెడ్ భవనాల నిర్మాణానికి మొత్తం రూ.22 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దరోగపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మి హరీష్ ఆధ్వర్యంలో వీవో గ్రామ సమైక్య భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో  ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.