30 July, 2026 | 2:03 AM

ష్ గప్ చుప్...

30-07-2026 12:00 AM
  1. రాత్రి వేళల్లో సింగభూపాలెం చెరువు మట్టి అక్రమ తోలకాలు 
  2. పేరు రైతులది ...తోలకాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు.

సుజాతనగర్ జూలై 28,( విజయక్రాంతి): చెరువు మట్టితోలకాలు అక్రమ దారులకు కల్పతరువుగా మారింది. రాత్రి వేళల్లో అధికారుల అనుమతులు లేకుండా గుట్టుచప్పు డు కాకుండా వందలాది ట్రాక్టర్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో నుంచి మ ట్టిని తోడేస్తున్నారు.

రైతుల పేరుతో పొలా ల్లో మట్టి తోలకాలకు అనుమతులు తీసుకొని, వాటి మాటన అక్రమంగా రియల్ ఎ స్టేట్ వెంచర్లకు మట్టిని తోలుతూ అక్రమాల కు తెరలేపుతున్నారు. పది ట్రిప్పుల అనుమతి తీసుకొని 100 ట్రిప్పులు రాత్రి వేళల్లో జోరుగా అక్రమ రవాణా సాగిస్తున్నారు.

రాజకీయ అండదండల తోనే... 

సింగభూపాలెం చెరువు మట్ట తవ్వకాల్లో రాజకీయ నేతల హస్తం మెండుగానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాజకీయ అండదండలు ఉండ టంతో వెనకడుగు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అనుమతులు పొందిన రైతులు దర్జాగా పగలు మట్టిని తోలుకొని వె సులుబాటు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో మట్టి తోలకాలు జరగటం అనేక అనుమానాలకు దారితీస్తుంది.అర్ధరాత్రి ట్రాక్టర్ల శబ్దాలతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆ ప్రాంతం స్థానికులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇబ్బడి ముబ్బడిగా అధిక లోడుతో ట్రాక్టర్లు విచ్చలవిడిగా నడుపుతున్నట్లు స్థానికులు ఆరో పిస్తున్నారు.

మమ్మల్ని ఎవరు ఆపలేరు..

సింగభూపాలెం చెరువులో నుంచి అక్రమంగా మట్టిని తోడేస్తున్న తోడేళ్లకు ఒక వై పు రాజకీయ అండదండలు మరోవైపు అనధికారికంగా అధికారుల అనుమతులు ఉండ డంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లే కుండా పోతుందని తెలుస్తోంది. ఈ విషయంపై తహసిల్దార్ కృష్ణ ప్రసాద్ ఏమంటు న్నారంటేసింగభూపాలెం చెరువు నుంచి మ ట్టితోలకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆ ప్రాంతపు రైతు పొ లాల సా రవంతం కోసం సంబంధిత నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు.

అనుమతులు అలా ఉంటే పే రుకే రైతు పొలాలకు తోలుతున్నమని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెరువు మట్టిని అమ్ముకుంటున్నారు ఆరోపణలు వస్తున్నా యి. అనుమతులు అతిక్రమించి గోప్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెరువు మట్టి అక్రమ రవాణా చేసే వారిపై ఖచ్చితమైన చర్యలు ఉంటాయని సుజాతనగర్ తహాసిల్దార్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.