15 June, 2026 | 10:55 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

22-12-2025 11:15 AM

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నెదర్లాండ్స్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. విమానం ఆర్‌జీఐఏలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force) సిబ్బంది సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని వారాలుగా ఆర్‌జిఐఏకు వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వస్తుండటంతో సిబ్బంది, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.