15 June, 2026 | 9:42 PM

Breaking News

250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •  

ఆదిలోనే అడ్డంకులు

22-12-2025 11:45 AM

వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారానికి సర్పంచ్ సహా ఏడుగురు వార్డ్ మెంబర్లు గైర్హాజరు

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్పంచ్ తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు హాజరు కాలేదు. ఉప సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో అధికారులు వారితో ప్రమాణస్వీకారం మహోత్సవం చేపట్టారు.గ్రామపంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉండగా ఉపసర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు హాజరు అవడంతో సగం కోరం ఉండడంవల్ల  ప్రమాణస్వీకారం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం లో సభ్యుల మధ్య భేదం ఉండడం కనిపించింది.సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య ఆదిలోనే వర్గ విభేదం దర్శనమిచ్చింది.గ్రామపంచాయతీ పాలకవర్గ కాలం ఐదేళ్లపాటు కలసి పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు ఎవరికి వారు వర్గాలుగా విడిపోవడం చూస్తే మీరు హయాంలో పంచాయతీ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ప్రభుత్వం సర్పంచ్ ,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి విడుదల చేసిన షెడ్యూల్ నే సర్పంచ్ గౌరవించకపోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.