2 September, 2026 | 4:45 AM

శక్తిశర్మకు వైమానిక మార్షల్ హోదా

02-09-2026 | 01:05am
  1. తొలి మహిళగా చరిత్ర
  2. వాయుసేన హర్షం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఎయిర్ వైస్ మార్షల్ (Air Vice Marshal) హోదాను పొందిన తొలి మహిళా అధికారిగా (వైద్యేతర విభాగంలో) శక్తిశర్మ నిలిచి చరిత్ర సృష్టించారు. మంగళవారం ఆమె ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో(Air Headquarters) అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు వాయుసేన ఎక్స్ వేదికగా ప్రకటించింది.

1994 జూన్ 18న ఐఏఎఫ్ విద్యా విభాగానికి నియమితులైన శక్తి శర్మ శిక్షణా సంస్థలు, ఫీల్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయి ర్ హెడ్ క్వార్టర్స్ వంటి విభిన్న పోస్టింగ్‌లలో పనిచేసిన అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

ఐఐటీ కాన్పూర్, పూణె విశ్వవిద్యాలయంలో ‘ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్స లెన్స్’ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. త్రివిధ దళాల నుంచి సైనిక పాఠశా లకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మొదటి మహి ళా అధికారిగానూ గతంలో చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాలకుపైగా విశిష్ట సేవలతో ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని వాయుసేన హర్షం వ్యక్తం చేసింది.

డీజీఎఎఫ్‌ఎంఎస్‌గా సందీప్ థరేజా..

ఎయిర్ మార్షల్ సందీప్ థరేజాకు ‘డైరెక్టర్ జనరల్ ఆర్మ్ ఫోర్సెస్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్’గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన 47వ అధికారి. సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులకు మెరుగైన, ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిం చడం ఆయన నూతన బాధ్యతలలో భాగం గా ఉన్నాయి. గగన్‌యాన్ మిషన్ అనలాగ్ ప్రయోగంలో కూడా సందీప్ కీలకపాత్ర పోషించారు.