2 September, 2026 | 2:21 AM

విద్యార్థులపై కేసులు కొట్టివేత

02-09-2026 | 01:02am
  1. నీట్ నిరసనలపై సుప్రీంకోర్టు తీర్పు
  2. హింస, ఆస్తి నష్టం కేసులపై దర్యాప్తు కొనసాగించాలి
  3. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించండి
  4. విద్యార్థుల విజయమన్న అభిజీత్ దీప్కే

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: నీట్ నిరసనల సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (Article 142 of the Constitution) కింద అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కొట్టివేసింది.

అదే సమయంలో నేర చరిత్ర ఉన్న 2,873 మంది ప్రదర్శనలలో హాజరయ్యారని, ఇందులో హింస, ఆస్తి నష్టానికి పాల్పడిన వారిపై అభియోగాలు కొనసాగించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆత్మహత్యకు పాల్పడిన నీట్ కుటుంబాలకు పరిహారం అందించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కేసులను కొట్టివేయాలనే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసనను ఉపసంహరించుకున్నట్లు అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. కోర్టు ఇస్తున్న సానుకూల హామీ, న్యాయబద్ధమైన పవిత్రతను కాపాడేందుకు, ఉత్తర్వుల దృష్ట్యా, నిరసన ప్రదర్శన పిలుపును ఉపసంహరించుకోవడం సముచితమని సీజేపీ భావిస్తోందని కోర్టుకు తెలిపారు. 

హామీలను  ప్రభుత్వం కట్టుబడి ఉంది : తుషార్ మెహతా

కేసు విచారణలో భాగంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. సీ  ఇచ్చిన మూడు హామీలను ప్రభుత్వం నెరవేర్చేందుకు కట్టుబడి ఉందన్నారు. సీజేపీ ఢిల్లీలో నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంపై కేంద్రం మూడు హామీలు ఇచ్చిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రాత్మక క్షణంగా సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించగా, తీర్పు విద్యార్థులకు దక్కిన విజయంగా వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అభివర్ణించారు.