22 August, 2026 | 5:01 PM

షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ జన్మదిన వేడుకలు

22-08-2026 03:54 PM

దోమకొండ, ఆగస్టు 22 (విజయ క్రాంతి): దోమకొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కుమారుడు, రాష్ట్ర యువజన నాయకుడు మహ్మద్ ఇలియాస్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలియాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్,మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, సర్పంచ్ ఐరనీ నరసయ్య, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, జిల్లా కార్యదర్శి తాటిపల్లి శ్రీకాంత్, పిన్నెం నాగేంద్ర, మహ్మద్, బట్టు రాములు, అబ్రబోయిన రాజు, అబ్రబోయిన స్వామి, ప్రశాంత్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.