ట్రాక్టర్ బావిలో పడి డ్రైవర్ మృతి
22-08-2026 04:45 PM
ఖానాపూర్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావాపూర్ ఆర్ గ్రామంలో విషాదం నెలకొంది. పొలం పనులు చేస్తున్న కేజీవీల్ ట్రాక్టర్ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగాధర్ మృతి చెందాడు. రోజువారీగా వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ తో పొలంలో పనులు చేస్తున్న గంగాధర్ ట్రాక్టర్ ను రివర్స్ తీస్తుండగా వెనుక ఉన్న వ్యవసాయ బావిలోకి ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తో సహా గంగాధర్ బురదలో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






