22 August, 2026 | 5:45 PM

పోలీస్ స్టేషన్‎లో వ్యక్తి హల్చల్

22-08-2026 04:53 PM

గంజాయి మత్తులో వ్యక్తి

బోధన్ ఆగస్టు 22 (విజయ క్రాంతి):  గంజాయి మత్తులో వ్యక్తి పోలీస్ స్టేషన్లలో హల్‎చల్ చేశాడు. పోలీసులపై దాడికి సైతం తెగబడ్డాడు. ఈ ఘటన బోధన్ పోలీస్ స్టేషన్లలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బోధన్ మండలంలోని  కొప్పర్గా గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి కొన్నిరోజుల క్రితం వచ్చింది.   అక్కడ చికిత్స అనంతరం ఆమె కొప్పర్గకు వెళ్లిపోయింది. అయితే శుక్రవారం రాత్రి ఆ గ్రామానికి  చెందిన సాయిలు అనే వ్యక్తి  ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి హల్చల్ చేశాడు. సదరు మహిళకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమిటని ప్రశ్నిస్తూ డ్యూటీ డాక్టర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన వైద్యురాలు, సిబ్బంది కలిసి డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు స్పందించి ఆస్పత్రికి చేరుకుని ఆ వ్యక్తిని పోలీ స్టేషన్ కు  తరలించారు. అయితే గంజాయి మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆగ్రహంతో సీఐ, కానిస్టేబుల్పై దాడికి తెగబడ్డారు. సీఐ తొడపై దాడి చేశాడు. . అలాగే కానిస్టేబుల్ వేలు కొరకడంతో కొద్దిభాగం తెగిపోయింది.  వెంటనే వారిని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.