అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి
22-08-2026 03:57 PM
నిర్మల్, ఆగస్టు 22 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీబీవీ (పాఠశాలలో) కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిని సుజాత తెలిపారు. పీజీసీఆర్టి ఇంగ్లీష్ సబ్జెక్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందని సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడీ పూర్తి చేసిన మహిళ అభ్యర్థులు అర్హులని ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు . దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డెమో నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.






