31 May, 2026 | 2:09 AM

యువతిపై లైంగిక వేధింపులు

31-05-2026 12:00 AM
  1. అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్
  2. కామాంధుడు అరెస్ట్
  3. నిందితుడు సాధనాల సంతోష్ కుమార్‌కు రిమాండ్

మేడ్చల్ అర్బన్ మే 29 (విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన చోటు చోటు చేసుకుంది. మేడ్చల్ సిఐ ఎ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం యువతిపై లైంగిక దాడికి పాల్పడటమే కా కుండా అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న నిందితుడిని  శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

మేడ్చల్ సిఐ కథనం ప్రకారం మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన సాధనాల సంతో ష్ కుమార్ (20) అనే యువకుడు  యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంత టితో ఆగకుండా బాధితురాలిని నేరపూరితంగా బెదిరిస్తూ అశ్లీల సామగ్రిని సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తూ వేధింపులకు గురిచేశాడు.

జవహర్‌నగర్ టు మేడ్చల్ : జీరో ఎఫ్‌ఐఆర్ ద్వారా వేగవంతమైన చర్యలు

సంఘటనపై బాధితురాలు తొలుత ఈ నెల 28న జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం (క్రైమ్ సీన్) మేడ్చల్ పరిధిలోకి రావడంతో జవహర్నగర్ పోలీసులు తక్షణమే జీరో ఎఫ్‌ఐఆర్ నమో దు చేశారు. అనంతరం మే 29న ఈ కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసును స్వీకరించిన మేడ్చల్ పోలీసులు అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

ముమ్మరంగా సా గుతున్న దర్యాప్తు కీలక ఆధారాల స్వాధీనం చేసి  కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు అత్యం త వేగంగా స్పందిస్తూ దర్యాప్తును  ముందు కు తీసుకెళ్తున్నారు. మేడ్చల్ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ స్వయంగా బాధితురాలి వద్దకు వెళ్లి నిబంధనల ప్రకారం ఆమె పూర్తి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అక్కడ సేకరించిన కీలక నమూనాలను తదుపరి శాస్త్రీయ విశ్లేషణ కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.

బాధితురాలిని బెదిరించడానికి అశ్లీల వీడియోలు ప్రసారం చేయడానికి నిందితుడు ఉపయోగించిన కీలక ఆధారాలైన మొబైల్ ఫోన్తో పాటు రెండు ట్యాబ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ సీఐ. ఎ. సత్యనారాయణ ను కామాంధుని కేసుకు విచారణ అధికారిగాగా వ్యవహరిస్తూ దర్యాప్తును పర్యవేక్షిస్తు న్నారు.

నిందితుడు సాధనాల సంతోష్ కుమార్‌ను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతనికి రిమాం డ్ విధించింది. మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.