31 May, 2026 | 2:58 AM

ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా అవగాహన

31-05-2026 12:00 AM

పొగాకు వ్యసనానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపు

నాగోల్, మే 3౦ (విజయక్రాంతి): ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా ఎల్.బి నగర్లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శని వారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, దాని దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ‘నాగోల్ కి చెందిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, ఉపాధ్యక్షుడు బీరయ్య, సంయుక్త కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, ఎం. రమేష్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలపై వివరాలు తెలియజేశారు. పలువురు సామాజిక కార్యకర్తలు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.