30 June, 2026 | 12:18 AM

గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?

13-04-2026 11:08 AM

సురేంద్రనగర్: గుజరాత్‌లోని సురేంద్రనగర్(Surendranagar) జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Gujarat Accident) జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వారిపైకి ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్ నుండి బహుచరాజీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం యాత్రికుల బృందం ఊరేగింపుగా నడుచుకుంటూ వెళ్తుండగా, లఖ్తార్-విరామ్‌గామ్ రహదారిపై తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని లఖ్తార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ యోగేష్ పటేల్ వెల్లడించారు.

తాజా బ్రేకింగ్ వార్తల కోసం  Vijayakranthi హోమ్‌పేజీని సందర్శించండి

జిల్లాలోని లఖ్తర్ తాలూకాలోని భాస్కర్‌పారా గ్రామం శివార్లలో నిర్లక్ష్యంగా నడుపుతున్న ట్రక్కు భక్తుల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన డంపర్ డ్రైవర్ మరణించారని, మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. "యాత్రికులు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బహుచరాజీలోని ఒక ఆలయంలో ప్రార్థనలు సమర్పించేందుకు వారు కాలినడకన బయలుదేరగా, వెనుక నుంచి అత్యంత వేగంతో దూసుకొచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొట్టింది," అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ యోగేష్ పటేల్ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న తాజా సంఘటనల కోసం  నేషనల్ న్యూస్ విభాగాన్ని చూడండి


ఇవి కూడా చదవండి:

వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు

గుజరాత్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

గుజరాత్‌లో ఉగ్ర కుట్ర

గుజరాత్‌ మంత్రులందరూ రాజీనామా..

గుజరాత్‌కు నందాదేవి