మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ
ములుగు (మహబూబాబాద్) జూన్ 29 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ములుగు జిల్లా పోలీస్, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ మాట్లాడుతూ ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి మూలమలుపు నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్, ములుగు డి.ఎస్.పి రవీందర్, పస్ర సిఐ దయాకర్, ములుగు సీఐ సురేష్, ఎస్త్స్ర లు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, యువత, సిబ్బంది పాల్గొన్నారు.






