30 June, 2026 | 1:20 AM

విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

30-06-2026 12:15 AM

మహబూబాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ మండలం కంబాలపల్లి పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి రూరల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు రామసహాయం శ్రీధర్ రెడ్డి చొరవతో విద్యా ప్రదాత, దివంగత శ్రీమన్ ముడుంబై సింగచార్యులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 20 వేల రూపాయల విద్యాసామాగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యార్థులందరికీ నోట్ బుక్స్, ఎక్కాల పుస్తకాలు, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, విద్యార్థులకు సంబంధించిన పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అందజేశారు. శ్రీ ముడుంబై సింగాచార్యుల కుటుంబ సభ్యులు అప్పలాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను అందిస్తామన్నారు.