30 June, 2026 | 1:20 AM

రైతుభరోసా ఎంత?

30-06-2026 12:17 AM
  1. స్పష్టతనివ్వని ప్రభుత్వం 
  2. యాసంగి సీజన్ 2 ఎకరాలకు పరిమితం 
  3. నేడు రైతు పెట్టుబడి సాయం విడుదల 
  4. ఆందోళన చెందుతున్న రైతులు 

నిర్మల్ జూన్ 29 ( విజయ క్రాంతి) : రాష్ట్రంలో అధికారులు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం పంట పెట్టుబడి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 30న తెలంగాణలోని రైతాంగానికి రైతు పెట్టుబడి సాయం రైతు భరోసానిధులను విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసింది.

అయితే రైతు భరోసా పెట్టుబడి సాయం పై ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఈసారైనా రైతు పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో రైతు ఖాతాలో జమ చేస్తారా లేక యాసంగి సీజన్లో రెండు ఎకరాలకి పరిమితం చేసిన సాయం అమలు చేస్తారా అని చర్చ జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా సుమారు 1, 88,212 రైతులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఎకరానికి 6000 చొప్పున రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులను జమ చేయవలసి ఉంది. ఇందుకోసం జిల్లాలో 226.80 కోట్ల నిధులను విడుదల చేయవలసి ఉంది 

రైతుకు భరోసా ఎంత 

ఇప్పటికి వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఖరీఫ్ రబీ సీజన్లో ఒక ఎకరానికి 6000 చొప్పున రైతు పెట్టుబడి సాయం అందించవలసి ఉంటుంది. గతంలో అధికారులు ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ సాగుభూమి ఉన్న లేకపోయినా పెట్టుబడి సాయం రైతు ఖాతాలో జమ చేయగా ఈ ప్రభుత్వం రైతులు సాగు చేసుకుంటున్నా భూములకు మాత్రమే పెట్టుబడి సాయం పారదర్శకంగా అందిస్తామని ప్రకటించింది.

అయితే యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం 2025 అక్టోబర్ లోని ఎకరానికి 6000 చొప్పున రైతు ఖాతాలో జమ చేయవలసి ఉండే. మార్చి నెలలో ప్రభుత్వం కేవలం రెండు విడతల్లో రెండు ఎకరాలకు 12 ఆర్థిక సహాయాన్ని మాత్రమే రైతు ఖాతాలో జమ చేసి మిగతా డబ్బులను ఇంతవరకు జమ చేయలేదు. వానాకాలం సీజన్ రైతుబంధు సోమవారం విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎన్ని ఎకరాల వరకు పెట్టుబడి అందుతుందో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.

ప్రభుత్వం ఏడు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని సూచనప్రాయంగా ప్రకటించినప్పటి యాసంగిలో రెండు ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయని ఖాతాలో జమ చేసింది. 226 కోట్ల 160 కోట్లు మాత్రమే రైతు ఖాతాలో జమ చేయగా 76 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈసారైనా రైతు పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో ఐదు ఎకరాల వరకు అందిస్తేనే రైతులకు ఇబ్బంది ఉండదు. గతంలో మాదిరిగా ఒకటి రెండు ఎకరాలకు రైతు పెట్టుబడి సాయం అందితే మాత్రం రైతులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

ప్రభుత్వం సోమవారం బిడ్డలు చేయనున్న రైతుబంధు సాయం రైతులకు పూర్తిస్థాయిలో ఏ మేరకు భరోసా ఇస్తుందో విడుదల చేసే నిధులను బట్టి రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం అందించాలని జిల్లా రైతుల కోరుతున్నారు