29 June, 2026 | 11:07 PM

నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు

13-04-2026 11:41 AM

నోయిడాలో హింసాత్మకంగా మారిన కార్మికుల ఆందోళన

న్యూఢిల్లీ: కనీస వేతనాల పెంపును(Minimum Wage Increase) డిమాండ్ చేస్తూ కర్మాగార కార్మికులు చేపట్టిన నిరసనలు(Workers Protest) సోమవారం నోయిడాలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయని పోలీసులు తెలిపారు. ఫేజ్-2, సెక్టార్ 60 ప్రాంతాల నుండి అగ్నిప్రమాదాలు, విధ్వంసం, రాళ్ల దాడికి సంబంధించిన ఘటనలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

అధికారుల ప్రకారం, వివిధ పారిశ్రామిక యూనిట్లకు చెందిన పెద్ద సంఖ్యలో కార్మికులు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీతాల సవరణ డిమాండ్‌ను సాధించుకోవాలని కోరుతూ గుమిగూడి, ప్రదర్శన సందర్భంగా నినాదాలు చేశారు. అయితే, ఆ నిరసన హింసాత్మకంగా మారింది. ఈ దాడుల్లో నిరసన కారులు ఆస్తులను ధ్వంసం చేశారని, రాళ్లు విసిరారని, ఒక వాహనానికి నిప్పు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. పరిశ్రమ(Noida Factory Workers Protest ) ముందు పెద్ద సంఖ్యలో కార్మికులు గుమిగూడారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై బాష్ప వాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు.