ఆరుద్ర కార్త్తె ప్రారంభమైనా.. ఆశించిన వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులు
- మేఘవృతం ఆయిన చోటే వర్షాలు
- వానమ్మ రావమ్మ అంటున్నా రైతులు
- కామారెడ్డి జిల్లాలో గత ఏడాది కంటే తగ్గిన వర్షాలు
- ఆందోళన చెందుతున్న రైతులు
కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): కార్తెలు దాటుతున్న ఆశించిన వర్షాలు జిల్లాలో కురువకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుద్ర కార్తి ప్రారంభమై వారం రోజులు గడిచిన వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈపాటికి వర్షాలు సమృద్ధిగా కురవడంతో మెట్ట ప్రాంతాలలో మొక్కజొన్న, జొన్న, పత్తి సోయాబీన్ పంటలు వేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో బోర్లు కింద వరి తూకాలు వేసి నాటు వేసేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు.
వర్షాల కోసం ఎదురుచూపులు
వర్షం భారీగా కురిస్తే అదే పదనతో వరి నాట్లు వేయాలనుకుంటున్నారు రైతులు . వానమ్మ ఒకసారి వచ్చిపో అమ్మ అంటూ రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వర్షం కురిసినచోట కుంభ వర్షం కురిసి వెళ్ళిపోతుంది. మేజర్ గా జిల్లాలో వర్షం సమృద్ధిగా కురవలేదు. దీంతో మొక్కజొన్న, పత్తి వేసిన రైతులు ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న సమృద్ధిగా వర్షాలు మాత్రం కురవడం లేదు. గత ఏడాది ఈపాటికి వర్షాలు సమృద్ధిగా పడి మొక్కజొన్న, జొన్న, పత్తి, వరి పంటలు నాటారు. ప్రస్తుతం 10 శాతం కూడా వరి నాట్లు కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాలం గడుస్తున్న వర్షాలు లేవు
కాలం గడిసిపోతుంది వర్షం జాడలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే పంటలు పండిస్తామని రైతులంటున్నారు. ఇలా వర్షాలు లేకుంటే పంటలు వేసి నష్టపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన కు గురవుతున్నారు. వారం రోజులపాటు వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
వర్షాలు కురవకుంటే విత్తనాలు నష్టం
ఈ వారం లోనైన సమృద్ధిగా వర్షాలు కురిస్తే పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వర్షాలు లేకుంటే పంటలు వేయకుండా ఉండడమే ప్రయోజనం ఉంటుందని రైతులంటున్నారు. లేకుంటే భూమిలో వేసిన విత్తనాలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరుణ దేవుడు కరుణిస్తేనే పంటలు
వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతం వరకు వర్షాలు సమృద్ధిగా కురువలేదని వర్షాల కోసం ఎదురుచూస్తున్నట్లు రైతులు తెలిపారు.






