30 June, 2026 | 1:20 AM

వంటింట్లో కరువు..

30-06-2026 12:00 AM
  1.  మార్కెట్లో ధరల హోరు
  2. జంట నగరాల్లో ఆచితూచి కొనుగోలు చేస్తున్న మహిళలు 
  3. శివారు ప్రాంతంలో  రియల్ ప్రభావం 
  4. జిల్లాలో తగిన సాగు విస్తీర్ణం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రతి ఉదయం రైతు బజార్లకు, కూరగాయల మార్కెట్లకు వెళ్లే సామా న్యుడి కళ్లలో ఇప్పుడు ఒకటే ఆందోళన కనిపిస్తోందిఅదే ‘ధరల భారం‘. ఒకప్పుడు జంట నగరాల చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల రైతులు తెచ్చిన తాజా కూరగాయలతో కళకళలాడిన ఈ మార్కెట్లు, ఇప్పుడు పక్క రాష్ట్రాల నుండి వచ్చే లారీలపై ఆధారపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

జంట నగరాల్లో మారుతున్న సీన్..

ఒక దశాబ్దం క్రితం వరకు జంట నగరాల ప్రజలకు కూరగాయల కొరత ఉండేది కాదు. నగర శివారుల్లోని సాగు విస్తీర్ణం ఇప్పుడు భారీగా కుంచించుకుపోవడంతో, గ్రేటర్ హైదరాబాద్లోని కిచెన్లన్నీ ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి వచ్చే సరుకులపైనే ఆధారపడుతున్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విస్తారమైన కూరగాయల తోటలు ఉండేవి. ఉదయాన్నే తాజా పంట జంట నగరాల మార్కెట్లకు చేరేది. కూరగాయల సాగు 5.5 లక్షల ఎకరాల నుండి 50 వేల ఎకరాలకు పడిపోవడంతో, ఇప్పుడు హైదరాబా ద్కు కావాల్సిన 90% కూరగాయలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరాది రాష్ట్రాల నుంచి లారీల్లో తరలించాల్సి వస్తోంది.

లాజిస్టిక్ భారం.. ధరల మంట..

జంట నగరాల ప్రజలు కొనే ప్రతి కేజీ కూరగాయపై ‘రవాణా ఖర్చు’ భారం భయం కరంగా పెరుగుతోంది. వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే లారీల ఇంధన ఖర్చులు, రోడ్ల మీద సమయం వృథా కావడం వల్ల వస్తువు ధర మార్కెట్కు వచ్చేసరికి రెట్టింపు అవుతోంది. దిగుమతి చేసుకునే కూరగాయలు మార్కెట్కు వచ్చేసరికి పాడయ్యే అవకాశం ఎక్కువ. ఈ నష్టాన్ని కూడా వ్యాపారు లు ధరల్లోనే వేస్తున్నారు. కొత్తిమీర నుంచి చింతపండు వరకు.. స్థానికంగా పం డాల్సిన కొత్తిమీర వంటి చిన్నపాటి ఆకుకూరలు కూడా గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి వస్తున్నాయంటే, జంట నగరాల్లో సాగు ఎంతలా కనుమరుగైందో అర్థం చేసుకోవచ్చు.

జంట నగరాలకు ముంచుకొస్తున్న ముప్పు..

కేవలం ధరలే కాదు, ఇప్పుడు జంట నగరాలకు ’సరఫరా గొలుసు’  విచ్ఛిన్నమయ్యే ముప్పు పొంచి ఉంది.వాతావరణ మార్పుల వల్ల ఉత్తరాదిలో దిగుబడి తగ్గితే, ఆ ప్రభా వం నేరుగా హైదరాబాద్లోని బొయిన్ న్పల్లి, గడ్డి అన్నారం వంటి ప్రధాన మార్కెట్లలో కనిపిస్తుంది. ఒక్కసారి సప్లయ్ తగ్గితే, సిటీలో కూరగాయల ధరలు సామాన్యుడి అందుబాటులో ఉండవు.

వ్యవసాయ నిపుణుల హెచ్చరిక..

జంట నగరాల చుట్టూ పెరి-అర్బన్  ఫా ర్మింగ్ను ప్రోత్సహించకపోతే, భవిష్యత్తులో నగర ప్రజలు కూరగాయల కోసం మరింత కష్టపడాల్సి వస్తుంది. ఒకవైపు హైదరాబాద్ విస్తరిస్తోంది, జనాభా పెరుగుతోంది. మరోవైపు కూరగాయల సాగు తగ్గిపోతోంది. జం ట నగరాల వంటింట్లో పచ్చదనం వెల్లివిరియాలంటేప్రభుత్వాలు కేవలం వరి మీదనే కాకుండా, నగర శివారుల్లో కూరగాయల సాగును  పునరుద్ధరించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. లేకపోతే, భవిష్యత్తులో జంట నగరాల వంటిళ్లు ఖాళీ అయ్యే ప్రమాదం లేకపోలేదు.