30 June, 2026 | 1:20 AM

అమ్మేసినాక.. పెరిగిన ధర?

30-06-2026 12:00 AM

మద్దతుకు మించి మొక్కజొన్నకు ధర.! 

క్వింటాకు రికార్డు ధర రూ. 2,455

మహబూబాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి.. గత యాసంగి సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్న పంట అమ్మకాలు దాదాపు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మక్కలకు క్వింటాలుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 కు మించి ధర మార్కెట్లలో లభిస్తోంది.

సోమవారం వరంగల్ మార్కెట్లో మొక్కలకు గరి ష్టంగా క్వింటాలుకు 2,455, కేసముద్రం మార్కెట్లో 2,424 రూపాయల ధరపలికి రికార్డు సృష్టించింది. మక్కలకు ఇంత ధర మా ర్కెట్లలో ప్రైవేట్ ట్రేడర్లు పెట్టడం విశేషంగా చెబుతున్నారు. పంట పండించిన తర్వాత సీజన్లో మక్కలను విక్రయానికి తెచ్చిన రైతులకు ప్రైవేటు ట్రేడర్లు క్వింటాల్ కు గరిష్టంగా 1800 నుండి 1900 రూపాయల ధర మాత్రమే చెల్లించారు.

దీనితో అన్నదాతలకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం మా ర్క్ఫెడ్ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాల ద్వారా మక్కలను కేంద్రం ప్రకటించిన క్వింటాల్ కు 2,400 చొ ప్పున కొనుగోలు చేయించింది. రాష్ట్రవ్యాప్తం గా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల మొ క్కజొన్నలను మార్క్ఫెడ్ సంస్థ కొనుగోలు చే సి, రైతుల ఖాతాల్లో దాదాపు 90 శాతం మందికి చెల్లింపులు కూడా పూర్తి చేసింది.

మరో 10 శాతం మంది రైతులకు వివిధ కారణాలతో చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. మొక్కజొన్న పంట పండించిన రైతుల్లో చా లామంది మార్క్ ఫెడ్ సంస్థకు విక్రయించడానికి రోజుల తరబడి నిరీక్షించలేక క్వింటాలకు 1700 నుండి 1800 కు అగువకు విక్రయించగా, మరి కొందరు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించి, అనేక కష్టనష్టాలు ఎదుర్కొని మార్క్ఫెడ్ సంస్థకు 2400 చొప్పున విక్రయించారు. అత్యల్పంగా కొందరు మాత్రం వాహనాకాలం పెట్టుబడి కోసం మక్కలను నిలువ తీసుకుని విక్రయిస్తున్న వారికి మాత్రం ఇప్పుడు ఆశించిన ధర దక్కుతోంది.

అయితే సగానికి పైగా రైతులు తక్కువ ధరకు విక్రయించి క్వింటాలుకు 500 రూపాయల వరకు నష్టపోగా, తక్కువ ధరకు రెండు నెలల క్రితం మక్కలను ఖరీదు చేసిన వ్యాపారులకు ఇప్పుడు పెరిగిన ధర లాభాలను తెచ్చిపెడుతోందని చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి కూడా పెరుగుతున్న మక్కల ధర మార్క్ఫెడ్ సంస్థ కూడా పెద్దగా నష్టపోయే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఏది ఏమైనా రైతుల వద్ద నుండి మొక్కజొన్న పంట పూర్తిగా విక్రయించిన తర్వాత ధర పెరగడం వల్ల వ్యాపారులకు లాభసాటిగా మారి, అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు.