29 June, 2026 | 11:15 PM

ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ

29-06-2026 10:19 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో చేపడుతున్న సర్ ప్రక్రియను ఆర్డీఓ విజయకుమారి సోమవారం పరిశీలించారు. ఎన్యూమరేషన్ కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని బసవతారక నగర్, పాండు తర్ఫాలో గల 72,73 బూత్ లలో చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియను స్పాట్ విజిట్ చేశారు. అక్కడ బిఎల్ఓ, బిఎల్ఏ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్ ప్రక్రియ ను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని ఆదికారులకు ఆదేశించారు. సిబ్బంది పని చేస్తున్న తీరును గమనించి తగు సూచనలను చేశారు.