జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర
ఆగస్ట్ 28 ముగింపు, ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్
శ్రీనగర్, ఏప్రిల్ 12: అమర్‌నాథ్ యాత్ర జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 57 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్ట్ 28తో ముగిస్తుంది. యాత్ర చేపట్టాలనుకునే భక్తులు ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.
‘జమ్మూకశ్మీర్, ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్, ఎస్’తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 554 బ్యాంకు శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తుగా పేర్లను నమోదు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత పద్ధతిని పాటించనున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం 13ఏళ్ల వయసున్న పిల్లలను, 70 ఏళ్లకు పైబడిన వృద్ధు లను యాత్రకు అనుమతించరు. కాగా తొలిపూజ జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 29న జరుగు తుంది. యాత్రికుల భద్రత కోసం పరిపాలనా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను ప్రారంభించింది.




