30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చలివేంద్రం ఏర్పాటు

22-04-2026 12:00 AM

కొండపాక, ఏప్రిల్ 21: వెలికట్ట చౌరస్తాలో సర్పంచ్ బూర్గుల మానస సురేందర్ రావు మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూర్గుల మానస సురేందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతినిత్యం వేలాదిమంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసరి లింగారావు, ఉప సర్పంచ్ అమ్ముల పరుశరాములు, వార్డు మెంబర్స్ ముత్యంరావు, భాస్కర్, నాయకులు మంచాల కనక రాములు, కొమురవెల్లి రాజు, బూర్గుల నరేందర్ రావు, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.