13 May, 2026 | 2:15 AM

తిరుపత్తూరు ఎమ్మెల్యేకు చుక్కెదురు

13-05-2026 01:15 AM
  1. ఒక్క ఓటు మెజార్టీతో గెలుపుపై ప్రత్యర్థి రిట్ పిటిషన్
  2. అసెంబ్లీలో బలపరీక్షకు ఎమ్మెల్యే హాజరుపై మద్రాస్ హైకోర్టు బ్రేక్

చెన్నై, మే ౧౨:  టీవీకే ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన తిరుపత్తూరు ఎమ్మెల్యే ఆర్.శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు హాజరుకాకుండా స్టే విధించింది. టీవీకే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే ఒకరోజు ముందు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచనలం రేపింది. ఇంతకీ వివాదమేమింటే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి తన సమీప ప్రత్యర్థి కేఆర్ పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ గెలుపును సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో అసెంబ్లీలో టీవీకేకే ఒక ఓటు తగ్గనుంది.