2 June, 2026 | 9:42 PM

అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభం

02-06-2026 08:35 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల, వరంగల్ సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంప్ మంగళవారం ప్రారంభమైంది. క్యాంప్ తొలి రోజు విద్యార్థులకు మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే వివిధ యాప్‌లు, ప్రాసెసర్లు, ఆండ్రాయిడ్ వెర్షన్‌ల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులలో  ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే సుడోకో పజిల్‌ను సులభంగా పరిష్కరించే పద్ధతులను వివరించారు.

ఈ శిక్షణ కార్యక్రమాన్ని మెంటర్లు మల్లారపు యశ్వంత్, అరుణ్ నిర్వహించగా, ల్యాబ్ ఇన్‌చార్జ్ సైదం శ్రీకాంత్ సమన్వయం చేశారు.కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాఠశాల కార్యదర్శి భోగ మధుకర్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని వారు సూచించారు.