బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
దేవరకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ముత్యాల సర్వయ్య తోపాటు వందలాది మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావుత్రేంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం. సంక్షేమ పథకాలన్నింటికీ కోత పడింది.
-నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైంది,రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయింది. ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ, 100 రోజులు కాదు కదా.. 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలవుతున్న దాఖలాలు లేవని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏటా రూ. 15,000 రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారు.
-కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది. అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలి. రూ. 4000 పెన్షన్, మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే హామీలను అమలు చేసేలా ఈ బడ్జెట్‌లో నిధులు ఇవ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే కుమార్ నాయకులు కేతావత్ భీల్య నాయక్ వడ్ల రమేష్ నాయక్ కిషన్ నాయక్ బొడ్డుపల్లి కృష్ణ వేముల రాజు పొట్ట మధు జమీర్ బాబా మల్లేష్ సర్పంచులు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు




