calender_icon.png 21 February, 2026 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం వృద్ధి సాధించాలి

21-02-2026 12:41:14 AM

  1. ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి

రైతులు ఆయిల్ ఫామ్ సాగు తో లాభాలు పొంది ఆనందంగా జీవించాలి

ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.

కామారెడ్డి జిల్లా తో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఏందిరా రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మెషిన్ పంటనూనెను ఆయిల్ ఫామ్ పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అనేక ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కు కామారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

రైతులు ఆర్థికంగా బలపడేలా కంపెనీ పూర్తి సహకారం అందించాలని సమస్త ప్రతినిధులకు సూచించారు. వంట నూనెల ఉత్పత్తిలో సాయం సంప్రదించాలి అనే లక్ష్యంతో ఎన్‌ఎంఈఓ ఓపి పథకం కింద ప్రభుత్వం మొదటి నాలుగు సంవత్సరాల వరకు ఎకరాకు గరిష్టంగా 50,918  రూపాయలు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఆయిల్ ఫాం సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటగా మారుతుందని తెలిపారు.

రైతులకు ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే లాభాలను వివరించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకొని ఆదాయం పెంచుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లా మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారులు ఆర్టికల్చర్ అధికారులు ఆయిల్ ఫామ్ సాగు చేసే  రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అన్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాల్వంచ మండలంలో ఆయిల్ ఫామ్ సాగు అనుకూలమైన నేలలు, నీటి వనరులు  ఉన్నాయని తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలతోపాటు ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా 24 ఆదాయం పొందవచ్చని అన్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు సాంకేతిక స్థలాలు అందించడంతోపాటు గెలల కొనుగోలులో పారదర్శకత పాటించాలని సూచించారు.

ఆయిల్ ఫామ్ పై రైతులు మాట్లాడుతూ తమ ఆసక్తి నీ వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్,  జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి, తాసిల్దార్ సంబంధిత జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు.