మేడిగడ్డను రిపేర్ చేయండి
28-07-2026 12:45 AM
వరి నాటుతో ఓ రైతు వినూత్న నిరసన
కోరుట్ల, జూలై 27 (విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను రిపేర్ చేయాలంటూ ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రైతు దొప్పల జలంధర్ ‘మేడిగడ్డను రిపేర్ చేయాలి’ అని తన పొలంలో వరి నాటు వేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశాడు. గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేయాలని, లేకుం టే వరి, మక్కజొన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశాడు.






