calender_icon.png 21 February, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐలో చేరిన ఎస్సీ కాలనీ సర్పంచ్ సరస్వతి

21-02-2026 12:42:24 AM

కండువా కప్పి ఆహ్వానించిన కూనంనేని

పాల్వంచ, ఫిబ్రవరి 20, (విజయక్రాంతి): పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేట ఎస్సీ కాలనీ నర్పంచ్ బండా సరస్వతి శుక్రవారం  సిపిఐ పార్టీలో చేరారు. ఆమెకు ఎంఎల్ కూనంనేని సాంబశివరావు పార్టీకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇండిపెంటెంట్ అభ్యర్ధిగా మొన్నటి గ్రామపంచాయితీ ఎన్నికల్లో 178 ఓట్ల మెజార్టీతో నర్పంచ్గా గెలిచిన సరస్వతి ఎంఎల్ కూనంనేని సాంబశివరావు సారధ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితురాలై సిపిఐ చేరినట్లు తెలిపారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామ పంచాయితీ సమగ్రాభివృద్ధి సాధించాలంటే అది సిపిఐతోనే సాధ్యమని ఆమె అన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో చేరిన సర్పంచ్ సరస్వతి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటు పడాలని, పంచాయితీలో ఉన్న ప్రతీ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని సూచించారు. పాల్వంచ మండల సిపిఐ అనుబంధ రైతు సంఘం అధ్యక్షులు కొంగర అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలో సిపిఐ నాయకులు వాసిరెడ్డి మురళీ, చలిగంటి శ్రీనివాస్, బొర్రా కేశవులు, రాంబాబుతో పాటు తదితరులున్నారు.