పసుపు పడగ!
28-07-2026 12:22 AM
మహబూబాబాద్, ( విజయక్రాంతి ) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని ఓ మిల్లులో పసుపు గ్రేడింగ్ చేస్తుండగా పడగ విప్పిన అయిదు తలల సర్పం రూపంలో పసుపు కొమ్ము కూలీలకు కనిపించింది. తాము చాలాకాలంగా పసుపు గ్రేడింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ఆకారంలో కనిపించలేదని, మహిమాన్వితంగా భావించిన మిల్లు యజమానులు ఈ పసుపు కొమ్మును పూజా మందిరంలో ఉంచి పూజిస్తున్నారు.






