21-02-2026 12:41:10 AM
కల్లూరు, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాఆర్యవైశ్య ప్రెసిడెంట్,కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు కల్లూరు మండలపరిధిలోని పెద్ద కోరుకొండి గ్రామ మాజీ సర్పంచ్ మాదిరాజు జగన్నాథరావు 94 గురువారం రాత్రి అనారోగ్యంతో స్వగృహంలో మృతి చెందారు.
ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు 1966 నుండి 2019 వరకు ఆయన నాలుగు దపాలుగా సర్పంచుగా పని చేశారు అదేవిధంగా సత్తుపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు పెద్ద కోరుకొండి గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులుగా 1985లో పనిచేశారు. వారి కుటుంబం జలగం కుటుంబానికి అనుచరులుగా ఉన్నారు.
జలగం వెంగళరావు ప్రసాద్ రావు ,వెంకట్రావు, మిత్రులుగా ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి అనుచరులుగా ఉన్నారు వారి జీవితాంతం ప్రజలకు అంకితమై సేవలలో ప్రజల మన్ననలు పొంది ప్రజల హృదయాలలో చిరకాలంగా నిలిచిన వ్యక్తి పెద్ద కోరుకొండి మరియు పరిసర గ్రామ ప్రజలకు సుపరిచితులు వారి సేవలు మరువలేవంటూ విషాదఛాయలలో పెద్ద కోరుకొండి. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భర్త, కాంగ్రెస్ నాయకుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.