‘పాద’ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
దిల్‌సుఖ్‌నగర్‌లో ‘అడ్వాన్స్ ఊండ్ హీలింగ్ అండ్ లింబ్ సాల్వేజ్ ఇన్సిట్యూషన్’ ప్రారంభం
ఎల్బీనగర్, జూలై 27: పాదాలకు వచ్చే వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ వైద్యుడు కేవీఎన్‌ఎన్ సంతోష్ మూర్తి సూచించారు. భారతదేశంలో మొట్టమొదటి ’అడ్వాన్స్ ఊండ్ హీలింగ్ లండ్ లింబ్ సాల్వేజ్ ఇన్స్ ట్యూషన్’ను హైదరాబాద్‌లోని మూసారా మ్‌బాగ్‌లో సోమవారం హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రే య ప్రారంభించారు.
ఈ సందర్భంగా’హ్యాపీ ఫీట్’ అనే ప్రజా అవగాహన క్యాంపెయిన్ ప్రారంభించారు. అనంతరం అడ్వాన్స్ ఊం డ్ సర్జన్ క్లినిక్స్ చైర్మన్, ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ (తెలంగాణ చాప్టర్) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేవీఎన్‌ఎన్ సంతోష్ మూర్తి మాట్లాడుతూ... ఎంతో మంది పాదాలకు వచ్చే వ్యాధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యాధి ముదిరి మరణానికి దారితీస్తుందన్నారు. పాద సంరక్షణపై అవగాహన పెం చేందుకు ’హ్యాపీ ఫీట్’ ప్రచారం కృషి చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా డయాబెటిక్ బాధితులను పాద వ్యాధులు బాధిస్తున్నాయని తెలిపారు. పాద వ్యాధులను ప్రారం భ దశలోనే గుర్తిస్తే పాదం లేదా కాలు తొలిగించడం ముప్పును తప్పించవచ్చన్నారు. పాద సంబంధిత సమస్యలను ప్రారంభంలోనే గుర్తిస్తే అవసరం లేని కాళ్ల తొలగిం పులను తగ్గించ వచ్చని పేర్కొన్నారు. తెలంగాణ మధుమేహ వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటని, దాదాపు 24.5 లక్షల మందికి ఈ వ్యాధి నిర్ధారణ కాగా, పరీక్షించిన వారిలో సుమారు 14 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్లు తేలిందన్నారు.
డయాబెటిక్ ఫుట్ వ్యాధులు, కాళ్లను తొలగించాల్సి వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల భారం క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ’ఫుట్ అల్సర్’ (పాదాలపై మానని పుండ్లు) బారిన పడే అవకాశం ఉందని, ముందస్తు పరీక్షలు, సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం, ప్రత్యేక కాళ్ల రక్షణ చికిత్స ద్వారా మధుమేహం వల్ల జరిగే కాళ్ల తొలగింపుల్లో 85 శాతం వరకు నివారించవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణి, బొగ్గా రపు దయానంద్, మలక్ పేట ఎమ్మెల్యే బలాల, మాజీ కార్పొరేటర్ సైఫుద్దీన్, వైద్యులు పాల్గొన్నారు.






