7 March, 2026 | 11:29 AM

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

07-03-2026 01:14 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి 6: మండల పరిధిలోని రామన్నగూడెం ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా మారి వివిధ పాత్రలతో అలరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న హాజరై విద్యార్థులకు మెమెంటోలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగంపల్లి రవిందర్, పాఠశాల హెచ్‌ఎం నీరజ, రిటైర్డ్ హెచ్‌ఎం ధర్మయ్య, ఉపాధ్యాయులు వెంకన్న, సుధారాణి, అంగన్వాడీ టీచర్ పుష్పలత, ఏఎన్‌ఎం గిరిజ, ఆశా కార్యకర్త శైలజ, విద్యార్డులు పాల్గొన్నారు.