కొత్తగూడెం, గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలి
కొత్తగూడెం గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్‌ఎస్ శ్రేణుల అర్ధనగ్న ప్రదర్శన.
తుంగతుర్తి, మార్చి 6: మండల పరిధిలోని కొత్తగూడెం, గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి అర్ధనగ్న.. ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ..గత కేసీఆర్ ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రత్తిపాధనలో రోడ్డు మంజూరు అయిందని తెలిపారు.
ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ హడావుడిగా శంకస్థాపన చేసి రెండేళ్లయిన ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా మండల కేంద్రం నుండి వెంపటి.. తూర్పుగూడెం, వెంపటి.. బంధారామారం.. గుండెపురి. బండరామారం గ్రామాల మధ్య రోడ్లను వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మేడుదుల రమేష్, జిల్లా నాయకులు జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం యాదవ్, ఉపసర్పంచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




