15 June, 2026 | 1:13 PM

Breaking News

కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •  

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

11-03-2026 05:51 PM

గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ మండలం బంగ్లావెంకటపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం  స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.  డీఈవోగా భరత్, ఎంఈఓ గా రుత్విక్ గౌడ్  ప్రధానోపాధ్యాయులుగా హర్షిత్ వ్యవహరించారు.

ఉపాధ్యాయులుగా అక్షర, అఖిల, అవని, సహస్ర, మేఘన, మనోహర్, అరవింద్, సాత్విక్  తదితరులు విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమం అనంతరం పిల్లలకు ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్  కొంటెమైన నాగలక్ష్మి నర్సింలు, ఉపాధ్యాయులు విజయ మాధవి,సునీల్,మహేందర్ రెడ్డి, రజిత, శ్యామల, నాగరాజు, గీతాంజలి, నవనీత, రాజశ్రీ, నాజీయా తదితరులు పాల్గొన్నారు.