15 June, 2026 | 1:43 PM

Breaking News

మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •  

విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు

15-06-2026 12:20 PM

మల్లాపూర్, జూన్ 15(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభం తొలి రోజున విద్యార్థుల హాజరు నిరాశపరిచింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 180 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 20 మంది మాత్రమే పాఠశాలకు వచ్చారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల రాక కోసం ఎదురుచూస్తూ కనిపించారు. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనుకంజ వేసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో విద్యార్థుల హాజరు పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులు సూచించారు.