15 June, 2026 | 2:40 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం

15-06-2026 01:05 PM

దుండగుల తవ్వకాలతో ప్రాచీన శివాలయం ధ్వంసం

అలంపూర్ జూన్ 15: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) అలంపూరు మండలం ర్యాలంపాడు గ్రామానికి వెళ్లే దారిలో తుంగభద్ర బ్రిడ్జి పక్కన ఉన్న ప్రాచీన శివాలయం(Shiva Temple) గుప్తనిధుల వేటగాళ్ల దుశ్చర్యకు గురైంది. ఆదివారం అర్ధరాత్రి వేళ దుండగులు ఆలయ గర్భగుడి, ఆవరణలో తవ్వకాలు చేపట్టి, విగ్రహాలను ధ్వంసం చేసి బయటకు విసిరేసినట్లు స్థానికులు ఆరోపించారు. గర్భగుడిలో గొయ్యి తవ్విన ఆనవాళ్లు కనిపించాయి.గ్రామ చరిత్రకు గుర్తుగా నిలిచిన ఈ పురాతన ఆలయాన్ని రక్షించాలని,తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.పురావస్తు శాఖ అధికారులు స్పందించి, ఆలయ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.