యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి
15-06-2026 01:11 PM
బోథ్ జూన్ 15 (విజయ క్రాంతి): యోగ అనేది దినచర్యలో భాగం కావాలని యోగ శిక్షకురాలు మునిగేల యోగిత ప్రోగ్రాం అధికారి ప్రీతం రాథోడ్ లు పిలుపునిచ్చారు. సోమవారం సోనాల మండల కేంద్రంలో యోగ అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఆసనాల వల్ల వ్యక్తిత్వం నియంత్రణలో ఉంటుందన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవం జరిగేలా యోగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం. ఆయుష్ విభాగంలో యోగ ప్రత్యేకంగా మహిళలు వృద్ధులకు గర్భిణీలకు నేర్పించడం జరుగుతుందని ప్రోగ్రాం అధికారి పేర్కొన్నారు.జూన్ 12 నుండి 21 వరకు యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .కార్యక్రమంలో ఆశ అంగన్వాడి వర్కర్లు పాల్గొనాలన్నారు.ర్యాలీలో పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






