15 June, 2026 | 2:39 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి

15-06-2026 01:13 PM

సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు ప్రధాన గేటు వద్ద ఎస్పీఎం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారంకి 27వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నోరు మెదపడం లేదని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీఎం కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ విఠల్ లు రిలే నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి కార్మికులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.

కార్మికులు దీక్షా శిబిరంలో అలసిపోయి పడుకుంటుంటే ప్రజాప్రతినిధులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు.కేవలం మెమొరాండాలు, వినతిపత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కారం కావని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్మికుల పోరాటానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.దీక్షలో కూర్చున్న జిల్లా రాగులయ్య, చిలుముల వెంకటేష్, డి. సత్యనారాయణ, ముద్దాం లక్ష్మణ్ లకు  గోలేం వెంకటేశం, శీలం రాజమౌళి, గోగర్ల శ్యామ్‌రావు, కొత్తకొండ రాజేష్, జంగాలపల్లి వెంకటేష్, కలికోట రమణయ్య, బింగి రమేష్, అంబాల ఓదెలు, పెంటపర్తి శ్రీనివాస్, గాదెబోయిన శంకర్, గొగుర్ల రాములు, చిత్తవేణి రాజేష్ యాదవ్, బండి శ్రీనివాస్, జాడి అశోక్, నానాజీ, తన్నీరు పోశం, దేవేందర్ సింగ్, ముంజం శ్రీనివాస్, తాటి వెంకటేశం తదితర కార్మిక నాయకులు, కార్మికులు సంఘీభావం తెలిపారు.